Mon Dec 23 2024 11:53:59 GMT+0000 (Coordinated Universal Time)
అతనే నా సర్వస్వం.. రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన సిరి హన్మంత్
సిరి వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ.. నెటిజన్లు మరింత నెగిటివిటీని చూపించారు. దాంతో సిరిని తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా
హైదరాబాద్ : సిరి హన్మంత్.. వెబ్ సిరీస్, సీరియల్స్, యూ ట్యూబ్ షార్ట్ ఫిలింస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మాయి సుపరిచితురాలే. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత బాగా ఫేమస్ అయింది. ఆ సీజన్లో హౌస్ లో షన్నూతో బాగా క్లోజ్ గా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి క్లోజ్ నెస్, ఓవరాక్షన్ వల్ల బయటికి వచ్చాక చాలా నెగిటివిటీని చవిచూడాల్సి వచ్చింది. హౌస్ నుంచి వచ్చాక.. షన్నూ- దీప్తిలకు బ్రేకప్ అయింది.
సిరి వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ.. నెటిజన్లు మరింత నెగిటివిటీని చూపించారు. దాంతో సిరిని తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్న వార్తలొచ్చాయి. ఆమెతో కలిసి దిగిన ఫొటోలనూ శ్రీహాన్ తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. త్వరలో వీరిద్దరూ కూడా విడిపోతారని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా సిరి పెట్టిన పోస్ట్ తో ఆ ఊహాగానాలకు చెక్ పడింది.
తన రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇస్తూ.. శ్రీహాన్ తో ఉన్న ఫొటోను ఇన్ స్టా లో షేర్ చేసింది సిరి. "ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్" అని ఆ పోస్ట్ లో పేర్కొంది. సిరి చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీళ్లిద్దరి లాగే షన్నూ-దీప్తి కూడా కలిస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Next Story