Mon Dec 23 2024 14:57:26 GMT+0000 (Coordinated Universal Time)
Soumya Shetty : ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నటి.. బిగ్బాస్ గీతూ రాయల్పై కేసు..
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నటి సౌమ్య శెట్టి. దీంతో బిగ్బాస్ ఫేమ్ గీతూ రాయల్పై కేసు..
Soumya Shetty : సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి పలు సినిమాల్లో కూడా నటించిన నటి 'సౌమ్య శెట్టి'.. దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. సోషల్ ఇన్ఫులెన్సర్ అయిన సౌమ్య, తన తోటి సోషల్ ఇన్ఫులెన్సర్ జనపాల మోనితతో కలిసి వీడియోలు చేయడం కోసం ఫిబ్రవరి 23న మోనిత ఇంటికి వెళ్ళింది. అయితే ఆ సమయంలోనే మోనిత ఇంటిలో 74 తులాల బంగారం చోరీకి గురైంది.
దీంతో ఆ బంగారం సౌమ్యనే దొంగిలించిందని మోనిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సౌమ్య.. ఆ బంగారానికి తనకి ఏ సంబంధం లేదని, మోనిత కుటుంబం పోలీసులతో కలిసి తన పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని వెల్లడించింది. ఈక్రమంలోనే జాతీయ మానవ హక్కుల సంఘంలో సౌమ్య ఫిర్యాదు చేసింది. తనకి న్యాయం జరిగేలా చూడాలంటూ.. మోనిత కుటుంబం నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరి పై సౌమ్య కేసు నమోదు చేసింది.
ఇక తాజాగా బిగ్బాస్ ఫేమ్ గీతూ రాయల్, యాంకర్ ధనుష్లపై కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసు గురించి గీతూ రాయల్, ధనుష్ కలిసి ఓ యూట్యూబ్ వీడియో రిలీజ్ చేసారు. మోనిత, సౌమ్య తమకి ఫ్రెండ్స్ అని చెబుతూ.. సౌమ్య ఎలా దొంగతనం చేసింది అని చెబుతూ సౌమ్యే దొంగ అని నిర్ణయించేసారు. ఇక వీరు చేసిన వీడియో పై సౌమ్య రియాక్ట్ అవుతూ.. గీతూ రాయల్, ధనుష్ పై పరువు నష్టం కేసు నమోదు చేసింది.
అలాగే పలు మీడియా సంస్థలు పై కూడా ఈ కేసుని వేస్తున్నట్లు సౌమ్య ఓ వీడియో రిలీజ్ చేసారు. తనని డీఫెమ్ చేస్తూ, తన ఆత్మహత్య చేసుకునేలా.. గీతూ రాయల్, ధనుష్, మీడియా వాళ్ళు ప్రవర్తించినట్లు సౌమ్య పేర్కొంది. అయితే తనకి తోడుగా తన భర్త నిలిచాడని, అందుకనే ఇప్పుడు ధైర్యంగా పోరాడడానికి ముందుకు వస్తునంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story