Mon Dec 23 2024 13:05:53 GMT+0000 (Coordinated Universal Time)
తాప్సీని ట్రోల్ చేస్తూ.. తమన్నాను పొగుడుతున్న నెటిజన్లు.. ఎందుకో మీరే చూడండి !
ఈ ఇద్దరూ తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్) అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
కొన్ని కొన్ని సందర్భాల్లో మన నటీనటులకు దేశ సంస్కృతిపై ఎంతగౌరవం ఉందో, వాటిని ఎంతలా గౌరవిస్తున్నారో తెలుస్తోంది. అలాంటి ఒక సందర్భంలో తాప్సీకి, తమన్నాకు ఉన్న తేడా బయటపడింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు తాప్సీని ట్రోల్ చేస్తూ.. తమన్నా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాప్సీని ట్రోల్ చేయడానికి, తమన్నాను పొగడటానికి కారణమేంటనేగా మీ సందేహం. ఈ ఇద్దరూ తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్) అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలి.
ఈ నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు అక్కడున్న పెద్దవారితో పాటు తమన్నా, తాప్సీలను కూడా జ్యోతి ప్రజ్వలన చేయాలని కోరారు. అక్కడున్నవారంతా కాలికి చెప్పులతోనే జ్యోతిప్రజ్వలన చేయగా.. తమన్నా మాత్రం చెప్పులు తీసేసి జ్యోతి ప్రజ్వలన చేసింది. దాంతో పక్కనే ఉన్న ఆస్ట్రేలియా వారు ఇదేంటని అడగ్గా.. అదే భారత సంస్కృతి అని తమన్నా తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తాప్సీని ట్రోల్ చేస్తూ.. తమన్నాను మెచ్చుకుంటున్నారు. తమన్నా బాలీవుడ్ లో సినిమాలు చేసినా సౌత్ లో స్టార్ గా ఎదిగి భారతదేశ సంస్కృతిని గౌరవిస్తుంది. కానీ తాప్సీ మాత్రం ఆ బాలీవుడ్ వాళ్ళ లాగే మన సంస్కృతిని చిన్న చూపు చూస్తూ ఇలా చేసిందని మండిపడుతున్నారు.
Next Story