Mon Dec 23 2024 13:29:26 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్ ఫోన్ నంబర్ లీక్
తాజాగా ది కేరళ స్టోరీ సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు..
అదాశర్మ.. ఈ ముంబై భామ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్యూట్ గా పలుకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాల్లేక ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా ది కేరళ స్టోరీ సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ప్రేమించి.. వాళ్లను ఉగ్రవాదులుగా మారుస్తున్నారన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా.. పలు వివాదాలకు తెరతీసింది. కొన్నిరాష్ట్రాల్లో చిత్ర ప్రదర్శనలు నిలిపివేశారు. ఇన్ని నిరసనల మధ్య కూడా ది కేరళ స్టోరీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ సినిమా అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి అదాశర్మ వ్యక్తిగత ఫోన్ నంబర్ ను షేర్ చేయడంతో.. ఆమెకు నెట్టింటి నుండి వేధింపులు మొదలయ్యాయి. ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాలు చేస్తే.. ఇలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో.. అదా శర్మ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
Next Story