Sat Dec 21 2024 10:21:58 GMT+0000 (Coordinated Universal Time)
"ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేస్తాం"
శ్రీరాముడిని, హిందూ సంప్రదాయాల్ని ఎగతాళి చేసేలా ఉందని.. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదని
ప్రజలు కోరితే ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తెలిపారు. ఆయన ఆదిపురుష్ మూవీపై స్పందించారు. సినిమాలో రాముడు, హనుమంతుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని.. ప్రజలు కోరితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిపురుష్ను రాష్ట్రంలో నిషేధించే ఆలోచన చేస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలను నడమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ సినిమా.. అంచనాలకు అందుకోలేకపోయిందని అంటున్నారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర అని.. 'ఆదిపురుష్' సినిమా ప్రదర్శనపై జాతీయ స్థాయిలో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఛత్తీస్గఢ్లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్పూర్ జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మనేంద్రగఢ్ పట్టణంలో సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ ముందు ఆందోళన చేశారు. ఈ చిత్రం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన కథాంశం అని పలువురు ఆరోపించారు.
'ఆదిపురుష్'కు వ్యతిరేకంగా హిందూసేన ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ చిత్రం హిందువుల మనోభావాలు తీసేలా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. శ్రీరాముడిని, హిందూ సంప్రదాయాల్ని ఎగతాళి చేసేలా ఉందని.. సినిమాలో ప్రధాన పాత్రలను చూపించిన తీరు సరికాదని హిందూసేన అంటోంది. రామాయణంలోని పాత్రలకు, ఆదిపురుష్ లోని పాత్రలకు ఏ మాత్రం పోలిక లేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రాముడు, సీత, రావణుడు, హనుమంతుడికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేదా వాటిని సరిదిద్ది నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని హిందూసేన పిటిషన్ లో పేర్కొంది. మహర్షి వాల్మీకి, తులసీదాస్ వంటి గొప్ప రచయితల రచనలలో కనిపించే వర్ణనలకు విరుద్ధంగా ఈ సినిమాలోని పాత్రలు ఉన్నాయని పిటీషన్ లో పేర్కొన్నారు. సినిమాలో రావణుడు, హనుమంతుడు వంటి పాత్రలు పూర్తిగా భారతీయ నాగరికతకు దూరంగా ఉందని అన్నారు.
Next Story