Sat Dec 21 2024 10:04:13 GMT+0000 (Coordinated Universal Time)
ట్రోల్స్ పై స్పందించిన ఓం రౌత్ : వాళ్లంతా మూర్ఖులు
ఆదిపురుష్ రాబడుతున్న వసూళ్లతో తానెంతో సంతోషిస్తున్నట్లు తెలిపాడు. రామాయణాన్ని ఖూని చేశారన్న వ్యాఖ్యలపై ఓం రౌత్..
ప్రభాస్, కృతి సనన్ లు రాఘవ, జానకిలుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ జూన్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి షో నుండి ఈ సినిమా పై నెట్టింట తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుంది. సినిమా చూసిన వారిలో నూటికి 70 మంది డైరెక్టర్ పై మండిపడుతున్నారు. ఇంత దారుణంగా ఉంటుందని అసలు ఊహించలేదని అంటున్నారు. రెండ్రోజుల తర్వాత.. తొలిసారి డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ ట్రోలింగ్ పై స్పందించాడు. తనకు విమర్శలకంటే.. బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది ? ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న వసూళ్లే ముఖ్యమని పేర్కొనడం గమనార్హం.
ఆదిపురుష్ రాబడుతున్న వసూళ్లతో తానెంతో సంతోషిస్తున్నట్లు తెలిపాడు. రామాయణాన్ని ఖూని చేశారన్న వ్యాఖ్యలపై ఓం రౌత్ స్పందిస్తూ.. రామాయణం పూర్తిగా అర్థమైందని చెప్పినవారు తన దృష్టిలో మూర్ఖుల కిందే భావిస్తానన్నారు. లేదంటే తమకు అర్థమైందని అబద్ధం చెబుతున్నట్టు భావించాలన్నారు. "తీరుబడిగా కూర్చుని.. నాకు ఇందులోని డ్రామా అర్థమైంది అని చెప్పడం తీవ్ర తప్పిదమే అవుతుంది. ఎందుకంటే, రామాయణాన్ని సంపూర్ణ రీతిలో అర్థం చేసుకునే సామర్థ్యం ఎవరికీ లేదని భావిస్తాను." అన్నారు. తాను బాల్యంలో టీవీలో చూసిన రామాయణం చాలా పెద్దదన్న ఓం రౌత్..కేవలం యుద్ధకాండనే సబ్జెక్టుగా తీసుకుని సినిమా తీసినట్లు తెలిపాడు. ఇది ఉడత సాయం కిందికే వస్తుందని చెప్పాడు.
Next Story