Sat Dec 21 2024 10:19:39 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ లోకి ఆదిపురుష్ వచ్చేసింది.. చూసేయండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించాడు. రామాయణం ఆధారంగా రూపొందిన
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించాడు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి తాన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొదటి వారం బాగా ఆడినా ఆ తర్వాత లాంగ్ రన్ లో సినిమా అనుకున్న కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ముఖ్యంగా వివాదాల కారణంగా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపులు వచ్చాయి.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTTలోకి ప్రవేశించింది. ఆదిపురుష్ ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది. హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ- ప్రమోద్ సంయుక్తంగా టి-సిరీస్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్ మరియు తృప్తి తోరద్మల్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఆదిపురుష్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో ఉండటంతో పాటు అదనంగా 279 రూపాయలు చెల్లించాలి. ఇంకొద్దిరోజుల్లో ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ ఉండే అవకాశం ఉంది. రిలీజ్‌కు ముందు ఆదిపురుష్‌పై నెలకొన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 250 కోట్లకు అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా భారీ అంచనాలతో జూన్ 16న రిలీజైన సినిమా ఆదిపురుష్. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అనుకున్న వసూళ్లను రాబట్టలేకపోయింది.
Next Story