Mon Dec 23 2024 18:08:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ మూవీ రివ్యూ : మోడ్రన్ రామాయణం మెప్పించిందా ?
సినిమాకు మొట్ట మొదటి ప్లస్.. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఇవే లేకపోతే ఒక బొమ్మల సినిమాలా ఉండేది ఆదిపురుష్. సైఫ్ అలీ..
సినిమా : ఆదిపురుష్
విడుదల తేదీ : జూన్ 16, 2023
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, వత్సల్ షేత్, సోనాల్ చౌహాన్, తృప్తి తోరద్మల్
దర్శకుడు: ఓం రౌత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్
సంగీత దర్శకులు: అజయ్-అతుల్, సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటర్: ఆశిష్ మ్హత్రే, అపూర్వ మోతివాలే సహాయ్
కథ : మనకు తెలిసిన రామాయణమే. రాముడు అరణ్య వాసంలో ఉన్న సమయంలో రావణాసురుడు సీతమ్మను అపహరించడం. సీతమ్మ కోసం రాముడు లంకను చేరుకుని రావణాసురుడిపై విజయం సాధించడం. సీతమ్మ జాడ కోసం హనుమంతుడు లంకకు వెళ్లడం. వానరసేనతో రాముడు లంకేశ్వరుడిపై చేసిన యుద్ధం.
విశ్లేషణ:
సాధారణంగా రామాయణం అంటే రాముడు, లక్ష్మణుడు, సీత.. అనే పేర్లతోనే చెప్పుకుంటాం. కానీ ఈ పేర్లు అతి తక్కువగా వాడి.. రాఘవ, శేషు, జానకి, లంకేశ్ అంటూ మోడ్రన్ పేర్లతో సినిమా ముందుకు సాగుతుంది. అద్భుతమైన వీఎఫ్ఎక్స్ తో తెలుగులో సినిమాలు వస్తున్న తరుణంలో అతి చెత్తగా వీఎఫ్ఎక్స్ తో ముందుకు నడిపారు. ఎక్కడా కూడా రియాలిటీకి దగ్గరగా లేని పాత్రలను మన ముందుకు తీసుకుని వచ్చారా అని సగటు ప్రేక్షకుడికి అనిపించకమానదు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ముందు సినిమా తానాజీలో చేసిన మ్యాజిక్ ఇందులో ఏ మాత్రం మనకు కనిపించదు. తానాజీలో ఎలాగైతే రెండు మూడు సీన్లతో అద్భుతం చేశాడో.. ఈ సినిమాలో అలా చేయాలని పలు సీన్లు అనుకున్నారు కానీ.. అది ఏవీ వర్కౌట్ అవ్వలేదు.
సినిమాకు మొట్ట మొదటి ప్లస్.. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఇవే లేకపోతే ఒక బొమ్మల సినిమాలా ఉండేది ఆదిపురుష్. సైఫ్ అలీ ఖాన్ ను లంకేష్ గా చూపించిన విధానం కూడా ఏ మాత్రం బాగాలేదు. రావణాసురుడి లక్షణాలు కనిపించకపోగా.. అల్లావుద్దీన్ ఖిల్జీని చూపించినట్లు చూపెట్టారు. కృతి సనన్ సీత పాత్రలో బాగుంది. మరాఠీ నటుడు దేవదత్తే నాగే హనుమంతుని పాత్రకు న్యాయం చేశారు. మిగతా వాళ్ళు పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ లో జటాయు - రావణ యుద్ధం చాలా బాగుంది. ఇక హనుమంతుడు రాముడిని మొదటిసారి కలవడం కూడా అందరికీ నచ్చుతుంది. సుగ్రీవుడు-వాలి మధ్య గొడవ మాత్రం తేలిపోయింది. అజయ్-అతుల్ ద్వయం పాటలు అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది.
ఎలా ఉందంటే..
ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా ఉన్నా, సెకండ్ హాఫ్ పెద్దగా అనిపించదు. ఎడిటింగ్ బృందం నిడివిని తగ్గించి ఉండాలి. VFX గురించిన భయాలన్నీ నిజమయ్యాయి. ఆదిపురుష్ టీమ్ చాలా కాలం పాటు VFX వర్క్లపై ఎంత పని చేసినా చివరికి న్యాయం చేయలేకపోయారని సినిమా మొదలైన 15 నిమిషాలలోనే అర్థం అవుతుంది. రూ.500 కోట్ల బడ్జెట్ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయి. ఆదిపురుష్ హిందీ నుండి తెలుగులో డబ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువ సమయం, నటీనటులు హిందీ డైలాగ్లు చెప్పడం క్లియర్ గా తెలుస్తుంది. రావణాసురుడి రూపం, లంకా ప్రపంచాన్ని రూపొందించిన విధానం చాలా మందికి నచ్చకపోవచ్చు. మనం విన్న, చూసిన రామాయణానికి చాలా తేడా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా కూడా యావరేజ్ లా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
+ రాఘవ, జానకిల నటన
+ జైశ్రీరామ్ పాట, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
+ అక్కడక్కడా విజువల్స్
మైనస్ పాయింట్స్
- మోడ్రన్ గా చూపించడం
- సుదీర్ఘంగా సాగే సన్నివేశాలు
- భావోద్వేగాల కొరత
చివరిగా.. ఆదిపురుష్ మోడ్రన్ రామాయణం. లంకేష్ గెటప్, లంకతో పాటు పాత రామాయణాన్ని గుర్తు చేసుకోకుండా చూస్తే.. నచ్చుతుంది.
Next Story