Mon Dec 23 2024 19:36:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ రన్ టైం ఎంతో తెలుసా ? రేపు జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ రిలీజ్
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆదిపురుష్..
ప్రభాస్ - కృతిసనన్ సీతారాములుగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు సంయుక్తంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 16న విడుదల కాబోతోంది. సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్.. అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆదిపురుష్ ఫైనల్ అవుట్ పుట్ సిద్ధం చేసినట్లు సమాచారం. సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 54 నిమిషాలు వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఆదిపురుష్ సెన్సార్ కి కూడా వెళ్లనుంది. అక్కడేమన్నా కత్తెరలు పడతాయా లేక.. మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా చూడాలి. ఇక ట్రైలర్ కంటే ముందు సినిమా నుంచి జైశ్రీరామ్ సాంగ్ గ్లింప్స్ ను వదిలారు. ఈ ఫుల్ పాటను రేపు (మే20) విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆదిపురుష్ లో రావణుడిగా సైఫ్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతునిగా దేవదత్త నాగే కనిపించనున్నారు.
Next Story