Sat Dec 21 2024 13:04:49 GMT+0000 (Coordinated Universal Time)
ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్ రద్దు
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రాముడిగా..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ రిలీజ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. జూన్ 16న పలు ప్రధాన భారతీయ భాషల్లో ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదల కంటే ముందే.. జూన్ 13న ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రీమియర్ షో లు వేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించబోయే సినిమాల్లో ఆదిపురుష్ చిత్రం టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దాంతో, 15, 16న కూడా ప్రీమియర్లు వేయాలని నిర్ణయించారు.
తాజాగా ఈ నిర్ణయాన్ని చిత్రబృందం వెనక్కి తీసుకుంది. జూన్ 13న ప్రీమియర్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. జూన్ 15న సాయంత్రం ట్రిబెకా ఫిలిం ఫెసివల్ లో ఆదిపురుష్ ప్రదర్శన ఉంటుందని తెలిపింది. అయితే 13వ తేదీన ప్రీమియర్ ను రద్దు చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. శాంకుంతలం సినిమా లాగా.. ఆదిపురుష్ పై నెగిటివ్ టాక్ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శాకుంతలం సినిమాను చిత్రబృందం విడుదలకు నాలుగురోజుల ముందే హైదరాబాద్ లో ప్రీమియర్లు వేశారు. సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో.. సినిమా థియేటర్లలో విడుదలయ్యాక ప్రేక్షకాదరణ కరువైంది. ఫలితంగా సినిమా డిజాస్టర్ అయింది.
Next Story