Mon Jan 06 2025 11:01:57 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆదిపురుష్ టీజర్ లాంచ్ డేట్ ఫిక్స్
ఆదిపురుష్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదంటూ ఇప్పటికే ఫ్యాన్స్ పలుమార్లు డైరెక్టర్ ఓంరౌత్ పై..
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. సైఫ్ రావణ్ పాత్రలో కనిపించచబోతున్నాడు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆదిపురుష్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదంటూ ఇప్పటికే ఫ్యాన్స్ పలుమార్లు డైరెక్టర్ ఓంరౌత్ పై ఫైరయ్యారు. తాజాగా.. సినిమా టీజర్ లాంచ్ గురించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆదిపురుష్ టీజర్ ను అక్టోబర్ 2న లాంచ్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "మీ మ్యాజికల్ ప్రయాణం ఇప్పుడు మీ అనుభవం, మీ ప్రేమ. మీరంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్.. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బ్యాంక్ ఆఫ్ సరయు వేదిక వద్ద రిలీజ్ చేయనున్నాము. అలాగే ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరి 12న ఐమ్యాక్స్, 3డీలో విడుదల అవుతుంది." అని ఓం రౌత్ రెండు ఫోటోలతో ట్వీట్ చేశారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ వేడుకకు ప్రభాస్, కృతిసనన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Next Story