Mon Dec 23 2024 17:35:02 GMT+0000 (Coordinated Universal Time)
Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్ వచ్చేసిందోచ్.. హైలెట్ గా ప్రబాస్, సైఫ్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల..
యావత్ దేశం వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఆదిపురుష్ టీజర్ వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా నటిస్తున్నాడు. ప్రభాస్ కు జోడీగా కృతిసనన్ సీతగా నటిస్తోంది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. నేటి సాయంత్రం అయోధ్యలోని సరయు నదీతీరంలో టీజర్ ను రిలీజ్ చేశారు. 1.40 నిమిషాల ఈ టీజర్ ను చాలా అద్భుతంగా కట్ చేశారు. శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. టీజర్ ని బట్టి చూస్తే ఆదిపురుష్ ఒక విజువల్ వండర్ గా నిలిచేలా కనిపిస్తోంది. రామసేతుపై ప్రభాస్ నడిచొచ్చే తీరు, లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ రాక్షస గెటప్ హైలైట్ గా నిలిచాయి. అలాగే సీత, లక్ష్మణుడు, హనుమంతుడు క్యారెక్టర్స్ ను కూడా చూపించారు. "న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అని ప్రభాస్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాతికి ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో 3డి లో విడుదల కానుంది.
Next Story