Mon Dec 23 2024 17:28:29 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ తో అభిమానుల్ని మెచ్చారా ?
ఇక ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుందని కామెంట్ చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తిగా రామాయణం కథాంశంతో వస్తోంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, సైఫ్ అలీఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించిన విషయం తెలిసిందే.
సాయంత్రం 5.04 నిమిషాలకు దేశమంతా పలు థియేటర్లలో ఆదిపురుష్ ట్రైలర్ ను 3D ఫార్మాట్ లో ప్రదర్శించనున్నారు. అంతకంటే ముందే ఈరోజు మధ్యాహ్నం ఈ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుందని కామెంట్ చేస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టీసిరీస్, రెట్రోఫైల్స్ ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
Next Story