Sat Dec 21 2024 10:00:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ ..
ప్రీమియర్, ఫస్ట్ షో లు పూర్తయ్యే సరికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే మొత్తం షో లు కంప్లీట్ అయ్యే సరికి సినిమా
ఆదిపురుష్.. జూన్ 16, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామాయణం అందరికీ తెలిసిన ఇతిహాసమే అయినా.. ఈ సినిమాలో రామాయణాన్ని ఎలా చూపించారన్న ఆసక్తి ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించింది. ప్రీమియర్, ఫస్ట్ షో లు పూర్తయ్యే సరికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే మొత్తం షో లు కంప్లీట్ అయ్యే సరికి సినిమా ఏం బాలేదని, రామాయణాన్ని హేళన చేశారంటూ పెదవి విరిచారు. చాలా మంది బుక్సింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటి రామాయణాన్ని తమ పిల్లలకి చూపించాలని అనుకోవడం లేదని నెట్టింట్లో ట్వీట్లు చేస్తున్నారు. #AdipurushDisaster ట్రెండ్ అవుతోంది.
కాగా.. తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టిందని చెబుతున్నాయి సినీ వర్గాలు. తొలిరోజు రూ.80 నుంచి రూ.82 కోట్లు వసూలు చేసిందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్.. రూ.138.64 కోట్లు వచ్చాయని సమాచరం. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ చెరిపేసింది. ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు రూ.30 కోట్లు.. మిగతా భాషల్లో రూ.50 కోట్ల వరకూ ఆర్జించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కట్టారు. సినిమా తొలి రోజు వసూళ్లలో మెజారిటీ షేర్ ను తెలుగు ప్రేక్షకులే ఆర్జించి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.50.93 కోట్లు, కర్ణాటకలో రూ.8.57 కోట్లు, తమిళనాడు, కేరళలో రూ.2.35 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో రూ.48.24 కోట్లు, విదేశాల్లో రూ.26.75 కోట్లు వచ్చినట్లు చెబుతున్నాయి.
Next Story