Sun Dec 22 2024 22:50:41 GMT+0000 (Coordinated Universal Time)
ముంబై వీధుల్లో సిద్ధార్థ్ - అదితి రావు
సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం ముంబైలోని ఒక రెస్టారెంట్ లో సిద్ధార్థ్-అదితి కనిపించారు. అక్కడి నుంచి ఇద్దరూ..
కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ.. తామిద్దరిపై వస్తోన్న ప్రేమ వార్తలపై ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. వాలెంటైన్స్ డే రోజైనా.. ఓపెన్ అవుతారని ఎదురుచూసిన వారిని నిరాశపరిచారు. కానీ ఇద్దరూ కలిసి.. పార్టీలు, ఫంక్షన్లు, డిన్నర్లకు వెళ్తుండటం ఆ వార్తలకు బలం చేకూర్చాయి. తాజాగా.. మరోసారి ఈ జంట కెమెరాకు చిక్కింది.
సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం ముంబైలోని ఒక రెస్టారెంట్ లో సిద్ధార్థ్-అదితి కనిపించారు. అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా వీరిద్దరూ జంటగా హాజరయ్యారు. ఇలా ప్రతిచోటా జంటగా కనిపించే వీరిని.. ప్రేమించుకుంటున్నారా అని అడిగితే మాత్రం మాట దాటేస్తున్నారు. కొందరు సన్నిహితులు మాత్రం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే చెబుతున్నారు. సిద్దార్ద్ కి ఇప్పటికే పెళ్లి అయ్యి విడాకులు తీసుకోగా, సమంతతో కూడా ప్రేమాయణం నడిపి విడిపోయాడు. కాగా.. సిద్ధార్థ్, అదితిరావు హైదరి, శర్వానంద్ కలిసి మహా సముద్రం అనే సినిమాలో నటించారు.
Next Story