Mon Dec 23 2024 06:25:40 GMT+0000 (Coordinated Universal Time)
వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుంటున్న నాగార్జున
తాను వెయ్యి ఎకరాలను దత్తత తీసుకుని..దానిని హరితవనంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కినేని నాగార్జున చెప్పారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇది తెలియని వారుండరు. దేశ వ్యాప్తంగా చాలామందికి ఈ అంశంపై అవగాహన ఉంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత తెలంగాణలో మొదలైన ఈ కార్యక్రమం.. క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఎంపీ సంతోష్ కుమార్ ప్రముఖ సెలబ్రిటీలకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవ్వడంతో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతిఒక్కరికీ మొక్కల పెంపకంపై అవగాహన కలిగిస్తూ.. ఈ కార్యక్రమం ముందుకు వెళ్తోంది. రేపటి తరాలను ప్రకృతి విపత్తుల నుంచి రక్షించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తోడ్పడుతుందని ఆయన నమ్మకం.
అతిధిగా విచ్చేసి....
తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 కి ఆయన అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జునతో మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయిందని, ఇప్పటి వరకూ 16 కోట్ల మొక్కలను నాటామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. దాంతో నాగార్జున అవాక్కయ్యారు. అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలతో కొన్ని మొక్కలు, పార్కులు, అడవులను దత్తత తీసుకునేలా చేశామని పేర్కొన్నారు. హీరో ప్రభాస్ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని, శర్వానంద్ ఒక పార్కుని దత్తత తీసుకున్నారని తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ కు మొక్కల నాటడం పట్ల ఉన్న ఆనందాన్ని చూసిన నాగార్జున ఫిదా అయ్యారు. తాను కూడా సంతోష్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1000 ఎకరాలను దత్తత తీసుకుని..దానిని హరితవనంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Next Story