Fri Jan 10 2025 04:50:45 GMT+0000 (Coordinated Universal Time)
అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ కన్నుమూత
అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ కన్నుమూసింది. ఆమె వయసు 26
అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ కన్నుమూసింది. ఆమె వయసు 26 సంవత్సరాలే! ఆమె స్పందించలేని స్థితిలో పడి ఉందని ఒక మీడియా సంస్థ నివేదించింది. సోఫియా సవతి తండ్రి మైక్ రొమెరో ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఈ కేసు విచారణలో ఉంది. "సోఫియా తన అపార్ట్మెంట్ హోమ్లో మార్చి 1, 2024న విగత జీవిగా కనిపించింది. మరణానికి గల కారణాలపై స్థానిక పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది." సోఫియా లియోన్ సవతి తండ్రి ఫండింగ్ పేజీలో ఆమె మరణాన్ని ధృవీకరించారు. ఆకస్మిక నష్టంపై కుటుంబం తీవ్ర బాధను వ్యక్తం చేశారు. అంత్యక్రియలు, దర్యాప్తు ఖర్చులకు నిధులు ఇవ్వాలని ఆయన మద్దతుదారులను అభ్యర్థించారు.
వెరోనికా లోపెజ్ (సోఫియా తల్లి) తరపున రొమేరో దాదాపు $6,000 సేకరించారు. జంతువులు, పెంపుడు జంతువుల పట్ల లియోన్కు ఉన్న ప్రేమ అమోఘమని.. ఆమె ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. గత కొన్ని నెలలుగా అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాగ్నీ లిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్స్ తర్వాత సోఫియా మరణం అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్ లో నెట్టింది.
Next Story