Sun Apr 13 2025 13:27:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆడవాళ్లు మీకు జోహార్లు.. విడుదల తేదీలో మార్పు
ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ.. భీమ్లా నాయక్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందనో ఏమో తెలీదు గానీ..

శర్వానంద్ - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ వంటి అలనాటి హీరోయిన్లు నటించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. హీరోకి పెళ్లి చేసేందుకు తల్లి పడే పాట్లు.. నచ్చిన అమ్మాయి దొరికింది అనుకునే లోపే ఆ అమ్మాయికి మరొకరితో పెళ్లి సెట్ అవ్వడం వంటి ట్విస్ట్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read : తాజ్ మహల్ ను సందర్శించిన లవ్ బర్డ్స్
కాగా.. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ.. భీమ్లా నాయక్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందనో ఏమో తెలీదు గానీ.. ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదల తేదీలో మార్పు చేశారు. మార్చి 4వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. మరో పోస్టర్ వదిలారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్ ట్రైలర్ విడుదల కాబోతోంది.
News Summary - Advallu meeku joharlu movie releasing on march 4th
Next Story