Mon Dec 23 2024 03:13:39 GMT+0000 (Coordinated Universal Time)
'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగ్ పూర్తి.. 25న థియేటర్లలోకి !
'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా అలాంటిదే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలవ్వగా..
కిశోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ - రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ.. చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక సినిమా విషయానికొస్తే.. శర్వానంద్ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసే సినిమాల నుంచి మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా సినిమాలు చేస్తుంటారు.
Also Read : ప్రేమికుల రోజు భర్త నుంచి విడాకులు తీసుకున్న నటి
'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కూడా అలాంటిదే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడవాళ్ల మధ్యలో పెరిగిన ఓ అబ్బాయి పెళ్లికోసం పడే పాట్లను దర్శకుడు అందంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో.. సీనియర్ నటీమణులు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈనెల 25వ తేదీన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
News Summary - Advallu Meeku Joharlu Movie Shooting Completed, Movie Ready to Release on February 25th
Next Story