అడివి శేష్ దిగిన ఫొటోస్ వైరల్!
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న అడివి శేష్ ఈమధ్య వరస హిట్స్ అందుకున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే అడివి శేష్ లేటెస్ట్ [more]
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న అడివి శేష్ ఈమధ్య వరస హిట్స్ అందుకున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే అడివి శేష్ లేటెస్ట్ [more]
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న అడివి శేష్ ఈమధ్య వరస హిట్స్ అందుకున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే అడివి శేష్ లేటెస్ట్ గా ఎవరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఉత్కంఠ కలిగేలా మలుపులతో తెరకెక్కించారు. ఇందులో అడివి శేష్ తో పాటు నవీన్ చంద్ర, రెజినా నటించారు.
బయోపిక్……
అడివి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదొక బయోపిక్. 2008 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. దీన్ని మహేష్ బాబు నిర్మిస్తుండగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. టైటిల్ రోల్ చేస్తున్న అడివి శేష్ తన పాత్రలో పర్ఫెక్షన్ కోసం కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ మరియు సి ఆర్ పి ఎఫ్ జవాన్లతో కలిసి వారి జాబ్ గురించి క్షుణ్ణంగా తెలుకుంటున్నాడట. వారితో కలిసి దిగిన ఫొటోస్ అడివి శేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.