మొన్న మురళి శర్మ.. నేడు?
ఆలా వైకుంఠపురంలో అదరగొట్టిన మురళి శర్మ ఆ సినిమా కి భారీ పారితోషకం అందుకున్నాడు ఎగస్ట్రా చేశా అని.. మరీ భారీ పారితోషకం డిమాండ్ చేసాడనే టాక్ [more]
ఆలా వైకుంఠపురంలో అదరగొట్టిన మురళి శర్మ ఆ సినిమా కి భారీ పారితోషకం అందుకున్నాడు ఎగస్ట్రా చేశా అని.. మరీ భారీ పారితోషకం డిమాండ్ చేసాడనే టాక్ [more]
ఆలా వైకుంఠపురంలో అదరగొట్టిన మురళి శర్మ ఆ సినిమా కి భారీ పారితోషకం అందుకున్నాడు ఎగస్ట్రా చేశా అని.. మరీ భారీ పారితోషకం డిమాండ్ చేసాడనే టాక్ నడిచింది. మరి ఆ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత మురళి శర్మదే హైలెట్ పాత్ర. అయితే తాజాగా మురళి శర్మ లా మరో కేరెక్టర్ ఆర్టిస్ట్ భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి భారీ పారితోషకం డిమాండ్ చేసాడట.అతనెవరో కాదు.. మిర్చి సంపత్. మిర్చి సినిమాలో సంపత్ విలనిజం పండించాడు. అద్భుతమైన కేరెక్టర్ పడడం సంపత్ అదరగొట్టడంతో బాగా హైలెట్ అవడం జరిగింది.
అయితే కొరటాల శివ – చిరు సినిమాలో సంపత్ ఓ కీ రోల్ చేస్తున్నాడట. ఆ రోల్ చెయ్యడానికి ఆచార్య టీం ని సంపత్ భారీ పారితోషకం డిమాండ్ చేసాడనే టాక్ నడుస్తుంది. సంపత్ డిమాండ్ చేసిన ఫిగర్ చూసి నిర్మాతలు ఖంగు తిన్నారట. కానీ సంపత్ మాత్రం డిమాండ్ ఉంది అడిగింది ఇవ్వాల్సిందే అంటూ ఆచార్య నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడట. అయితే సంపత్ మీద అంత పెడితే ఓకె నా అనే ఆలోచనలో ఆచార్య టీం ఉందట. మరి సంపత్ కి అడిగింది ఇవ్వకపోతే.. అతను వాకౌట్ చేస్తే.. సంపత్ కి ఆల్టర్నేట్ నటుడుని ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచనలో టీం ఉందట.