ఆ ఆలోచనకే భయపడతారేమో
బాహుబలి తర్వాత చాలా మంది హీరోల కన్ను పాన్ ఇండియా మూవీస్ మీద పడింది. బాహుబలిలా నాలుగైదు భాషల్లో సినిమాని విడుదల చేసి హిట్ కోటయ్యాలనే కసితో [more]
బాహుబలి తర్వాత చాలా మంది హీరోల కన్ను పాన్ ఇండియా మూవీస్ మీద పడింది. బాహుబలిలా నాలుగైదు భాషల్లో సినిమాని విడుదల చేసి హిట్ కోటయ్యాలనే కసితో [more]
బాహుబలి తర్వాత చాలా మంది హీరోల కన్ను పాన్ ఇండియా మూవీస్ మీద పడింది. బాహుబలిలా నాలుగైదు భాషల్లో సినిమాని విడుదల చేసి హిట్ కోటయ్యాలనే కసితో ప్రభాస్ సాహో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక చిరంజీవి సైరా తో హిట్ అంటున్నాడు కానీ హిందీ, ఓవర్సీస్ పరిస్థితి చూస్తే సైరా నరసింహారెడ్డి పరిస్థితి డౌట్ కొడుతోంది. ఇక సాహో సినిమా ట్రైలర్ లో యాక్షన్ చూశాక అల్లు అర్జున్ కూడా తన ఐకాన్ సినిమాలో యాక్షన్ ఉండాలని కోరుకోవడమే కాదు సినిమాకి భారీ బడ్జెట్ పెట్టాలని చూశాడు. సాహో ఫలితం వచ్చాక అల్లు అర్జున్ భారీ బడ్జెట్ ఆలోచన విరమించుకున్నాడు.
మహేష్ టార్గెట్ అదే…..
ఇక మహేష్ బాబు మాత్రం కేవలం తెలుగు తమిళాన్నే టార్గెట్ చేస్తునందున పాన్ ఇండియా ఆలోచన చెయ్యడం లేదన్నారు. కానీ ప్రభాస్, చిరుని చూశాక మహేష్ అలాంటి ఆలోచన చెయ్యడనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇప్పుడు పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తునాడు కానీ వారు సాహో, సైరా చూశాక ఆలోచన విరమించుకునేవారే. చూద్దాం సాహో, సైరా ల తర్వాత భారీ బడ్జెట్ సినిమాల విషయంలో హీరోలేమైనా తగ్గుతారేమో అనేది.