Fri Mar 21 2025 01:58:24 GMT+0000 (Coordinated Universal Time)
సీతారామం స్టార్ మృణాల్ ఠాకూర్ గురించి క్రేజీ వార్తలు వైరల్
టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన సీతారామంతో ఆమె ప్రశంసలు అందుకుంది.

ఎన్నాళ్ల నుండో బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఎదురు చూసిన సక్సెస్ టాలీవుడ్ లో సీతారామం రూపంలో వచ్చేసింది. టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన సీతారామంతో ఆమె ప్రశంసలు అందుకుంది. ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తాయని భావిస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఆమెకు సంబంధిన రూమర్స్ కూడా బాగా ఎక్కువయ్యాయి. తాజాగా స్వప్నా దత్ నిర్మించబోయే లేడీ ఓరియెంటెడ్ చిత్రం కోసం ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్వరలో టాలీవుడ్ దర్శకురాలు బివి నందిని రెడ్డితో కలిసి మృణాల్ పనిచేయవచ్చనే కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదు.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్-30లో జూనియర్ ఎన్టీఆర్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటీవల నివేదికలు వచ్చాయి. ఈ నివేదికలు ఇంకా ధృవీకరించబడలేదు. మృణాల్ బాలీవుడ్ సినిమా 'పిప్పా' విడుదల కోసం ఎదురుచూస్తోంది. వార్ డ్రామాలో ఆమె ఇషాన్ ఖట్టర్ సరసన కథానాయికగా నటించింది. ఎయిర్‌లిఫ్ట్ సినిమాకు దర్శకత్వం వహించిన రాజా మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో డిమాండ్ పెరగడంతో మృణాల్ భారీగా రెమ్యునరేషన్ పెంచిందనే టాక్ కూడా వినిపిస్తోంది. వైజయంతి బ్యానర్లోనే వరుసగా రెండు సినిమాలు చేస్తుండడంతో ఆమెను పలువురు దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు.
News Summary - After Sita Ramam Mrunal Thakur to headline female-driven Telugu movie
Next Story