Tue Dec 24 2024 16:25:25 GMT+0000 (Coordinated Universal Time)
RRR బృందానికి ప్రముఖుల ప్రశంసలు
RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో దేశ వ్యాప్తంగా చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
RRR సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో దేశ వ్యాప్తంగా చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్వర్ అయితే ఈ బృందానికి అభినందనలు తెలుపుతూ మార్మోగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు గాయకులు, రచయిత, సంగీత దర్శకుడితో పాటు పాటకు నృత్యం చేసిన రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకు అభినందనలు తెలిపారు. తెలుగువాడి చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. ఇది దేశానికి గర్వకారణమని ఆయన కొనియాడారు. తండ్రిగా తాను గర్వపడుతున్నానని చిరంజీవి అన్నారు.
తెలుగు పదంతో...
భారతీయులు గర్వపడేలా ఆస్కార్ వేదికపై అవార్డును స్వీకరించి RRR చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పాటలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసిందని పవన్ కొనియాడారు. ఆస్కార్ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడమే కాకుండా అవార్డు పొందడం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరుకుందని పవన్ ట్వీట్ చేశారు.
ప్రముఖుల అభినందనలు...
ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లు తెలుగు సినిమాకు అవార్డు సాధించి పెట్టిన RRR సినిమా పాటకు ఆస్కార్ అవార్డు లభించడాన్ని అభినందించరు. ఇది దేశం విజయం అని కొనియాడారు. తెలుగువాడికి గర్వకారణమని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు RRR సిినిమా యూనిట్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచ పటంలో తెలుగువాడిని మరోస్థాయికి తీసుకెళ్లారని అందరినీ అభినందించారు.
Next Story