Mon Dec 23 2024 10:27:20 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజెంట్.. స్ట్రీమింగ్ డేట్ లాక్
ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఏజెంట్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా..
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 28న విడుదలైన అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాత అనిల్ సుంకర సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే నెగిటివ్ టాక్ తో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దాంతో చాలావరకూ ఏజెంట్ సినిమా థియేటర్ల నుండి వెనుదిరిగింది. ఏజెంట్ సినిమాకు ఇక థియేట్రికల్ రన్ కష్టమని భావించిన చిత్రయూనిట్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఏజెంట్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మే 19న ఓటీటీలో ఏజెంట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా వెల్లడించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. సినిమా విడుదలైన నాలుగు రోజులకే.. సినిమా ఫెయిల్యూర్ ను తన భుజాలపై వేసుకున్నారు. దాంతో అనిల్ సుంకర పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఒక సినిమా పరాజయాన్ని ఏ నిర్మాత ఇలా ఒప్పుకోరని కామెంట్స్ చేశారు.
Next Story