Mon Dec 23 2024 12:20:55 GMT+0000 (Coordinated Universal Time)
ఏజెంట్ మూవీ రివ్యూ : రొమాంటిక్ హీరో యాక్షన్ లో సక్సెస్ అయ్యాడా ?
దాంతో ఇలా అయితే లాభం లేదనుకుని తనకున్న ఎథికల్ హ్యాకింగ్ నైపుణ్యాలతో ఏకంగా రా చీఫ్ డెవిల్ అలియాస్ ..
సినిమా : ఏజెంట్
నటీనటులు : అఖిల్, మమ్ముట్టి, డైనో మోరియా, సాక్షివైద్య, విక్రమ్ జిత్, సంపత్ రాజ్, ఊర్వశి రౌటేలా
సంగీతం : హిప్ హాప్ తమిళ, భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్, జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర్, అజయ్ సుంకర, దీపా రెడ్డి
కథ : వక్కంతం వంశీ
దర్శకత్వం, స్క్రీన్ ప్లే : సురేందర్ రెడ్డి
విడుదల తేదీ : 28.04.2023
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ప్రేమకథలకు పెట్టింది పేరు. ఎన్నార్, నాగార్జున, నాగచైతన్య.. ఇప్పుడు అఖిల్ కూడా రొమాంటిక్ హీరోలుగానే స్టార్ డమ్ సంపాదించారు. ఇప్పటి వరకూ ప్రేమ కథలతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన అఖిల్.. ఇప్పుడు ఏజెంట్ గా యాక్షన్ లోకి దిగాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మమ్ముట్టి ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లు కష్టపడ్డాడు. మరి అతని కష్టానికి తగిన ఫలితం వచ్చిందా ? అనేది ఈ రివ్యూ స్టోరీలో చూద్దాం.
కథలోకి వెళ్తే..
రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) సాధారణ మధ్యతరగతికి చెందిన కుర్రాడు. స్పై అవ్వడమే అతని జీవిత లక్ష్యం. అందుకోసం రా లో చేరేందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ ప్రతీసారి ఇంటర్వ్యూలో రిజెక్షనే ఎదురవుతుంది. దాంతో ఇలా అయితే లాభం లేదనుకుని తనకున్న ఎథికల్ హ్యాకింగ్ నైపుణ్యాలతో ఏకంగా రా చీఫ్ డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్ ను హ్యాక్ చేస్తాడు. రిక్కీ కోతిచేష్టలు చూసిన ఆయన కూడా రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత భారతదేశాన్ని నాశనం చేసేందుకు గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి మిషన్ రాబిట్ పేరుతో భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. వాళ్ల కుట్రను చేధించి మిషన్ రాబిట్ ను అడ్డుకునేందుకు మహదేవ్ తన ఏజెంట్ సాయంతో ఓసారి ప్రయత్నించి విఫలమవుతాడు. రెండోసారి ఆ మిషన్ కోసం రిక్కీని రంగంలోకి దింపుతాడు. రా కి పనికిరాడని పక్కనపెట్టిన రిక్కీని ఈ మిషన్ లో ఏజెంట్ గా ఎందుకు తీసుకున్నాడు ? మహదేవ్ ఆదేశాలను కాదని రిక్కీ కొనితెచ్చుకున్న ప్రమాదమేంటి? రిక్కీ స్పై అవ్వాలనుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి ? మిషన్ రాబిట్ ను ఎలా అడ్డుకున్నాడు ? ఇవన్నీ తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన సినిమా ఏజెంట్. ముగ్గురు రా ఏజెంట్ల మధ్య జరిగే పోరాటంలా ఉంటుంది. ఒకరు దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోంటే.. మరో ఇద్దరు దేశాన్ని కాపాడాలని తపిస్తారు. ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా కథాంశం కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది. పఠాన్ లో చూపించిన యాక్షన్ హంగామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మన ఏజెంట్ లో మిస్ అయ్యాయి. యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వలేదు. మహదేవ్ ను రిక్కీ కాల్చి చంపడం, ఆ తర్వాత రిక్కీని చంపేయమని రా ఆదేశాలివ్వడంతో కథ ఆసక్తికరంగా ఆరంభమవుతుంది. ఆ తర్వాత రిక్కీ వాయిస్ ఓవర్ తో కథ నడుస్తుంది. అతని డ్రీమ్ ఫైట్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
+ అఖిల్, మమ్ముట్టి నటన
+ పోరాట ఘట్టాలు
+ ఇంటర్వెల్ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్
- రొటీన్ గా సాగే కథ
- హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏజెంట్ రెగ్యులర్ రొటీన్ స్పై థ్రిల్లర్
Next Story