Sun Dec 22 2024 22:24:41 GMT+0000 (Coordinated Universal Time)
Unstoppable 2 : సంక్రాంతికి పవన్ ఎపిసోడ్ లేనట్టే..
డిసెంబర్ 27న అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ 2కి పవన్ కల్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు పవన్ తో..
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో టెలీకాస్ట్ అవుతోన్న అన్ స్టాపబుల్ 2 సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. రెండో సీజన్లో ఏడు ఎసిసోడ్లు పూర్తవ్వగా.. 7వ ఎపిసోడ్ లో ప్రభాస్ పార్ట్ 1 ఎపిసోడ్.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలైన 24 గంటలకు 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయని ఆహా ప్రకటించింది. ఇక 8వ ఎపిసోడ్ కూడా ప్రభాస్ దే ఉండనుంది. పార్ట్ 2 ని జనవరి 6న టెలీకాస్ట్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ లో గోపీచంద్ కూడా రానున్నాడు.
డిసెంబర్ 27న అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ 2కి పవన్ కల్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు పవన్ తో బాలయ్య ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. అయితే ఇంతవరకూ పవన్ ఎపిసోడ్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. సంక్రాంతికి పవన్ కల్యాణ్ ఎపిసోడ్ వస్తుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటే.. ఆహా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సంక్రాంతి "వీరసింహారెడ్డి" స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందని పేర్కొంటూ పోస్ట్ చేసింది. దాంతో పవన్ అభిమానులు తీవ్రనిరాశ చెందారు. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ అతి త్వరలోనే ఉంటుందని పేర్కొంది ఆహా.
Next Story