Mon Dec 23 2024 07:07:14 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన బేబీ.. ఆ సీన్లు ఉంటాయా?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ. జూలై నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్ సాధించింది. బేబీ థియేట్రికల్ రన్ సమయంలో పలు వివాదాలు కూడా వెంటాడాయి. వైష్ణవి పాత్రను సరిగ్గా చూపించలేదని ఒక వర్గం ప్రేక్షకులు భావించారు. ఆమె పాత్రకు ఉద్దేశించిన డైలాగ్లకు కూడా కొంత అభ్యంతరం వచ్చింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు టైమ్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నిడివి ఉండగా కొన్ని సీన్లను కలిపి థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ వెర్షన్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ ఉన్నాయని అంటున్నారు. బేబీ యొక్క అధికారిక డిజిటల్ భాగస్వామి అయిన ఆహా వీడియో, మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OTT విడుదల తేదీని ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం OTT లో కూడా రికార్డ్లను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25 నుండి OTTలో ప్రసారం కానుందని టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రాగానే మనకూ ఓ క్లారిటీ వచ్చేయనుంది.
Next Story