Mon Dec 23 2024 05:32:13 GMT+0000 (Coordinated Universal Time)
నాటు నాటు పాటకి ఆస్కార్ నా వల్లే వచ్చింది : అజయ్ దేవగణ్
ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’కి హీరోయిన్ టబుతో కలిసి హాజరయ్యారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘటన ఆర్ఆర్ఆర్ సొంతం. ఈ సినిమా గతేడాది మార్చి 25న పాన్ ఇండియా లో విడుదలై.. ఏడాది పూర్తయింది. పాన్ ఇండియాగా వచ్చిన ఆర్ఆర్ఆర్.. ఆ తర్వాత పాన్ వరల్డ్ సినిమాగా మారిపోయింది. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. నాటునాటు పాటకు ఆస్కార్ తనవల్లే వచ్చిందంటూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అజయ్ దేవగణ్ నటించిన భోళా సినిమా మార్చి 30న విడుదల కాబోతోంది. తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబో తెరకెక్కిన ‘ఖైదీ’ మూవీకి రిమేక్ ఈ సినిమా. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. కామెడీ రియాలిటీ షో ‘ది కపిల్ శర్మ షో’కి హీరోయిన్ టబుతో కలిసి హాజరయ్యారు. అజయ్ దేవగణ్ కూడా ఆర్ఆర్ఆర్ లో నటించడంతో.. ‘నాటు నాటు’కి ఆస్కార్ రావడం గురించి అజయ్ ను ప్రశ్నించాడు కపిల్ శర్మ. దానికి అజయ్.. నా వల్లే ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చిందంటూ సమాధానం ఇచ్చారు. ఆశ్చర్యపోయిన కపిల్ శర్మ అదెలా? అని అడగ్గా ‘ఆ పాటకి నేను డ్యాన్స్ చేస్తే పరిస్థితి ఏంటీ?’ అని అజయ్ నవ్వులు పూయించారు. తాను డ్యాన్స్ చేయకపోవడం వల్లే పాటకు ఆస్కార్ వచ్చిందంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story