Mon Dec 23 2024 13:44:40 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ హిట్ కాంబో వచ్చేస్తుంది.. 'సింగం ఎగైన్' షురూ..
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో 'సింగం ఎగైన్' మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్..
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి.. సింగం సినిమాలతో ఒక కాప్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ లో ఇప్పటివరకు సింగం, సింగం రిటర్న్స్, సింబా, సూర్యవంశి సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ఇక ఈ యూనివర్స్ లో 'సింగం ఎగైన్' (Singham Again) మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు రణవీర్ సింగ్ కూడా నటించబోతున్నాడు.
సింగం సిరీస్ లో ఇది మూడో సినిమాగా వస్తుంది. ఈ మూవీని పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను రణవీర్ సింగ్ షేర్ చేస్తూ.. "రోహిత్ షెట్టు కాప్ యూనివర్స్ లోని నా ఫేవరెట్ క్యారెక్టర్ సింబాగా కనిపించడానికి అంతా సెట్ అయ్యింది. సింగం ఎగైన్ తో మళ్ళీ వస్తున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి" అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సింగం 1.. తమిళ హీరో సూర్య నటించిన సింగం 1కి రీమేక్ గా తెరకెక్కింది. 'సింగం రిటర్న్స్' కథని మాత్రం రోహిత్ శెట్టి సొంతంగా రాశాడు.
అయితే సింగం 1 హిట్ అయినంతగా సింగం రిటర్న్స్ కాలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అని మాత్రమే అనిపించుకుంది. మరి ఇప్పుడు ఈ 'సింగం ఎగైన్'తో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి. కాగా ఈ కాప్ యూనివర్స్ లో వచ్చిన 'సింబా' కూడా రీమేక్ గానే తెరకెక్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ 'టెంపర్'కి రీమేక్ గా సింబా తెరకెక్కింది. సౌత్ సినిమాలతో క్రియేట్ చేసిన క్యారెక్టర్ లతో బాలీవుడ్ మేకర్స్ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేసి హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story