Mon Dec 15 2025 00:18:15 GMT+0000 (Coordinated Universal Time)
స్టార్ హీరో అజిత్ ఇంట విషాదం.. ప్రముఖుల సంతాపం
సుబ్రమణ్యంకు అజిత్ తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్.. మొత్తం ముగ్గురు కుమారులున్నారు. అజిత్ కు పితృవియోగం..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం (84) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుబ్రమణ్యంకు అజిత్ తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్.. మొత్తం ముగ్గురు కుమారులున్నారు. అజిత్ కు పితృవియోగం కలిగిందని తెలిసి.. కోలీవుడ్ ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్కు చెందిన మలయాళీ. ఆయన భార్య పేరు మోహినీ.
కాగా.. ప్రస్తుతం అజిత్, షాలినీ పిల్లలతో కలిసి యూరప్ వెకేషన్ లో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలుసుకుని.. ఇప్పటికే చెన్నైకు పయనమైనట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్లోని శ్మశాన వాటికలో అజిత్ తండ్రి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. సుబ్రమణ్యం కొద్దిరోజులుగా పక్షవాతం, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. చికిత్స పొందుతూ శుక్రవారం ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.
Next Story

