Mon Dec 23 2024 15:04:18 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూల్ లో అఖండ 100 డేస్ సెలబ్రేషన్స్
జనవరి 20వ తేదికి అఖండ సినిమా 103 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యకాలంలో 50 రోజులపాటు ఓ సినిమా థియేటర్లలో..
కర్నూల్ : బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా హ్యాట్రిక్ హిట్ కొట్టింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన సింహా,లెజెండ్ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే అఖండ సినిమా కూడా రోరింగ్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా.. ఫస్ట్ షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.
జనవరి 20వ తేదికి అఖండ సినిమా 103 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యకాలంలో 50 రోజులపాటు ఓ సినిమా థియేటర్లలో ఆడిన దాఖలాలు లేవు. అలా 50 రోజుల నుంచి 100 రోజులకు చేరనుంది అఖండ సినిమా. మార్చి 11వ తేదీకి అఖండ 100 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా అఖండను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలని భావించిన టీమ్.. 12వ తేదీన కర్నూల్ లోని ఎస్టీబీసీ గ్రౌండ్స్ లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేసింది. మార్చి 12వ తేదీ, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే అఖండ 100 డేస్ సెలబ్రేషన్స్ అని అంటున్నారు బాలయ్య అభిమానులు.
Next Story