Sun Mar 23 2025 10:46:02 GMT+0000 (Coordinated Universal Time)
పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ, అఖండ టీం
అఖండ సినిమా టీం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

అఖండ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా విజయం సాధించడంతో.. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను లతో పాటు చిత్ర బృందం బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పానకాల నరసింహస్వామి గుడిలోకి బాలయ్య రావడంతోనే ఆయన అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
అఖండ విడుదలతోనే...
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం నియంత్రించినా.. అన్నింటికీ కట్టుబడే అఖండ సినిమాను రిలీజ్ చేశామని చెప్పారు. అఖండ సినిమా రిలీజై ఘన విజయం సాధించిన తర్వాత నిర్మాతలకు ధైర్యం వచ్చిందని, అఖండ స్ఫూర్తితోనే ఇప్పుడు చాలా సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయని బాలయ్య పేర్కొన్నారు. తన తర్వాతి సినిమా గురించి అభిమానులు అడుగగా.. దర్శకులు ముందుకొచ్చి మంచి కథ తెస్తే.. మల్టీస్టారర్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు బాలకృష్ణ.
Next Story