Mon Dec 23 2024 19:28:47 GMT+0000 (Coordinated Universal Time)
"అఖండ" విజయం.. తొలిరోజే ఊహించని కలెక్షన్స్ వసూలు
అఖండ సినిమా తొలిరోజే ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే హిట్ టాక్ తెచ్చుకుంది
లాక్ డౌన్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో భారీ హిట్ నమోదయింది. బోయపాటి శీను - నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలవ్వగా.. తొలిరోజే ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ రూ.53 కోట్లు వస్తే గానీ సినిమా లాభాల్లోకి రాదని అన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో...
తెలుగు రాష్ట్రాల్లో అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.45.5 కోట్లు జరిగింది. నైజాంలో రూ.10 కోట్లు, సీడెడ్ లో రూ.10.6 కోట్లు, ఉత్తరాంధ్ర లో రూ.6 కోట్లు, తూ.గో జిల్లాలో రూ.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లోలా రూ.3.5 కోట్లు, గుంటూరులో రూ.5.4 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.3.7 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.7 కోట్ల బిజినెస్ జరిగింది.
ఓవర్సీస్....
ఇక ఓవర్సీస్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో సినిమా థియేట్రికల్ హక్కులు రూ.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అఖండ సినిమా 1550 థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. అడ్వాన్స్ బుకింగ్ లతోనే సినిమా భారీ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాలో ప్రీ రిలీజ్ బుకింగ్ ల ద్వారా 300k డాలర్లు రాబట్టగా.. ఆస్ట్రేలియాలో ఈ సినిమా రికార్డు సృష్టించింది. అక్కడ సుమారు 30 లొకేషన్లలో సినిమా విడుదల చేయగా.. మొదటిరోజే 84,567 ఆస్ట్రేలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.
Next Story