Thu Jan 09 2025 16:41:37 GMT+0000 (Coordinated Universal Time)
అఖిల్ 'ఏజెంట్' ఓటీటీ లోకి వచ్చేస్తోంది
యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి
యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్ఫామ్ ఖరారయ్యాయి. ఏజెంట్ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సెప్టెంబర్ 29వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ “నిరీక్షణ ముగిసింది. రసవత్తరమైన వైల్డ్ రష్కు సిద్ధంగా ఉండండి. మమ్మూటి, అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్ ప్లాట్పామ్లో సెప్టెంబర్ 29 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అని సోనీ లివ్ ట్వీట్ చేసింది.
భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా సుమారు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఏజెంట్ సినిమాలో అఖిల్ హీరోగా చేయగా.. సాక్షి వైద్య హీరోయిన్గా సందడి చేసింది. మలయాళ స్టార్ నటుడు మమ్మూటి కీలకపాత్ర పోషించారు. డినో మోరియా, విక్రమ్జీత్, డెంజిల్ స్మిత్ కీలకపాత్రల్లో కనిపించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
Next Story