Mon Dec 23 2024 18:46:06 GMT+0000 (Coordinated Universal Time)
Akhil Akkineni : ‘తారక సింహారెడ్డి’గా అఖిల్.. షూటింగ్ కూడా స్టార్ట్..!
అక్కినేని అఖిల్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యిపోయిందా..? మహారాష్ట్ర అడవుల్లో షూటింగ్ జరుగుతుందా..? ‘తారక సింహారెడ్డి’గా..
Akhil Akkineni : అక్కినేని వారసుడు అఖిల్.. ఇప్పటివరకు ఐదు సినిమాలతో హీరోగా ఆడియన్స్ ని పలకరించారు. అయితే వీటిలో ఏది అఖిల్ కి హిట్టుని అందించలేకపోయింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ హిట్ అనిపించుకుంది. చివరిగా 'ఏజెంట్' మూవీతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్న అఖిల్.. ఇప్పటివరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు.
ఆ మధ్య యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో 'ధీర' అనే పిరయాడికల్ మూవీని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని గుసగుసలు వినిపించాయి. ఈ దర్శకుడు సాహో మూవీ మరియు యూవీ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశారట. అయితే ఇప్పటివరకు వీరి కాంబినేషన్ మూవీని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే చిత్ర యూనిట్.. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటూ వెళ్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఇటీవల ప్రభాస్ 'సలార్' మూవీ సక్సెస్ మీట్ లో అఖిల్.. చేతికి గాయంతో కనిపించారు. ఆ సమయంలోనే ఆ గాయం షూటింగ్ లో జరిగిందే అని, అఖిల్ కొత్త మూవీ స్టార్ట్ అయ్యిపోయిందని టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్రలోని అడవుల్లో జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీలో అఖిల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్ర పేరు 'తారక సింహారెడ్డి' అని సమాచారం. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, అక్కినేని అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.
Next Story