Fri Dec 20 2024 06:01:59 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : 'సలార్'లో ప్రభాస్‌కి తమ్ముడు..? ఆ పాత్రలో అక్కినేని అఖిల్..!
సలార్ సినిమాలో ప్రభాస్ కి తమ్ముడు ఉన్నాడా..? ఆ పాత్రని అక్కినేని అఖిల్ చేస్తున్నాడా..? ఆధారాలు కూడా చూపిస్తూ..
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన చిత్రం 'సలార్'. మొదటి భాగం 'సీజ్ ఫైర్' గత నెలలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? అని ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఈ సెలబ్రేషన్స్ లో కేవలం మూవీ టీం మాత్రం కనిపించింది. అయితే మూవీ టీం కాకుండా ఈ సెలబ్రేషన్ లో ఒక బయట హీరో కనిపించారు. అదే మన అక్కినేని అఖిల్. ఈ సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియోని మూవీ టీం నిన్న రిలీజ్ చేసింది. ఈ వీడియోలో అక్కినేని అఖిల్ కనిపించారు. ఇక అది గమనించిన ఆడియన్స్ అసలు అఖిల్ సలార్ టీంతో ఏం చేస్తున్నారని ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. కొంతమంది అయితే దాని వెనుక రీజన్స్ ని కూడా వాళ్లే వెతికి మరి అందరికి తెలియజేస్తున్నారు.
సలార్ సినిమాలో ప్రభాస్ చిన్నతనంలోనే తన తల్లి బేబీ బంప్‌తో ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు ఒక సీన్ లో కనిపిస్తుంది. ఆ సీన్ ని చూపిస్తూ.. సినిమాలో ప్రభాస్ కి తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పాత్రని అఖిల్ పోషిస్తున్నాడు అంటూ పలువురు నెటిజెన్స్ తమ వెర్షన్ కథలను వినిపించేస్తున్నారు. మరి ఈ నెటిజెన్స్ అంచనాలు ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఈ విషయం మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
Next Story