Mon Dec 23 2024 18:57:21 GMT+0000 (Coordinated Universal Time)
సమంత విషెస్ కు రిప్లై ఇచ్చిన అఖిల్.. ఏమన్నాడంటే
తాజాగా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సామ్.. తన ఇన్ స్టా స్టోరీలో విషెస్ చెబుతూ.. ఏజెంట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు..
నాగచైతన్యతో సమంత విడిపోయినప్పటికీ ఆ కుటుంబంలోని పలువురితో ఆమె టచ్ లో ఉందన్న విషయం తెలిసిందే. రానా-మిహికా, అఖిల్ లతో పాటు పలువురు దగ్గుబాటి, అక్కినేని కుటుంబీకులతో సామ్ టచ్ లో ఉంటోంది. తాజాగా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సామ్.. తన ఇన్ స్టా స్టోరీలో విషెస్ చెబుతూ.. ఏజెంట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ పోస్ట్ పై అఖిల్ స్పందిస్తాడా లేదా చూస్తోన్న నెటిజన్ల ఎదురుచూపులు ఫలించాయి. సమంత విషెస్ పై అఖిల్ స్పందించాడు.
సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. థాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు. దాంతో అఖిలో చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. కాగా.. సామ్ గతేడాది కూడా అఖిల్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపింది. కానీ అప్పుడు అఖిల్ స్పందించలేదు. ఈసారి కూడా అఖిల్ స్పందించడు అనుకున్న వారికి షాకిస్తూ.. అఖిల్ సామ్ కు రిప్లై ఇస్తూ వాళ్లందరికీ షాకిచ్చాడు.
Next Story