అయ్యో అఖిల్.. ఇలా జరిగిందేంటి..?
అక్కినేని వారసుడిగా.. నాగార్జున తనయుడిగా.. అఖిల్ భారీ అంచనాల మధ్య అఖిల్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రికెట్ ఆటలో మేళకువలు తెలిసిన ఆటగాడిగా [more]
అక్కినేని వారసుడిగా.. నాగార్జున తనయుడిగా.. అఖిల్ భారీ అంచనాల మధ్య అఖిల్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రికెట్ ఆటలో మేళకువలు తెలిసిన ఆటగాడిగా [more]
అక్కినేని వారసుడిగా.. నాగార్జున తనయుడిగా.. అఖిల్ భారీ అంచనాల మధ్య అఖిల్ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రికెట్ ఆటలో మేళకువలు తెలిసిన ఆటగాడిగా ఉన్న అఖిల్ కి నటనంటే ప్యాషన్ ఉండంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో సినిమా చేసి హీరోగా నిలబడిపోతామనుకున్న అఖిల్ కి మొదటి సినిమా అఖిల్ తో దర్శకుడు వినాయక్ భారీ డిజాస్టర్ చేతిలో పెట్టాడు. ఏదో తెలియక మాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాం.. ఈసారి కూల్ గా ప్రేమకథతో హిట్ కొడదామనుకున్నాడు.
ముచ్చటగా మూడో సినిమా కూడా
నాగార్జున ఓన్ బ్యానర్ లో తన కొడుకు కెరీర్ ని చక్కబెట్టే బాధ్యత తీసుకుని.. ఎంతో జాగ్రత్తగా దర్శకుడు విక్రమ్ ని సెట్ చేసి హలో సినిమా నిర్మించాడు. ఆ సినిమా లవ్ స్టోరీతో తెరకెక్కింది. సోల్ మేట్ కోసం వెతికే లవర్ బాయ్ లా అఖిల్ ఆకట్టుకున్నప్పటికీ… హలో సినిమా యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడో సినిమాని చాలా ఆచితూచి హిట్ డైరెక్టర్ వెంకీ అట్లూరికి చేశాడు అఖిల్. తొలిప్రేమతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి అఖిల్ ని లవర్ బాయ్ లా మిస్టర్ మజ్నులా చూపెట్టాడు. అయితే రెండు చిత్రాల ఎఫెక్ట్ అఖిల్ మూడో చిత్రం మీద బాగానే పడింది. మొదటి నుండి వెంకీ మీదున్న అంచనాలు అఖిల్ మీద లేవు. మీడియం అంచనాలతో నిన్న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను మళ్లీ యావరేజ్ టాక్ నే సొంతం చేసుకుంది.
బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే…
అఖిల్ యాక్టింగ్, డాన్సింగ్ స్టైల్, న్యూ లుక్ అన్ని కుర్రకారుకి నచ్చేలా ఉన్నాయి. కానీ వెంకీ దర్శకత్వం, కథ రొటీన్ గా ఉండడం, అలాగే ఈ ప్రేమకథలో ఫీల్ మిస్సయింది. ఇంకా అఖిల్ ని అమ్మాయిలను వెంటాడే అబ్బాయిలా చూపించడం.. ఒకొనొక టైంలో హీరోయిన్ నిధి అతడిని చూసి అసహ్యించుకుంటుంది. కానీ చిన్న కారణాలతో తన అభిప్రాయాలు మార్చుకుని అతడితో గాఢమైన ప్రేమలో పడిపోతుంది. కానీ అంతగా కన్విన్సింగ్ గా ప్రేక్షకుడికి అనిపించకపోవడంతో సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. మరి మూడో సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న అఖిల్ మళ్లీ యావరేజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.