అఖిల్ కెరీర్ నాశనం అవ్వాలంటే సినిమా చేస్తా..!
రాజమౌళి తనయుడు కార్తికేయకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో అక్కినేని అఖిల్ ఒక్కరు. అఖిల్, కార్తికేయ చాలా క్లోజ్. ఇద్దరు తరుచుగా కలుసుకుంటూనే ఉంటారు. చాలా ఏళ్ల నుండి వీరు సన్నిహితంగా మెలుగుతున్నారు. అఖిల్ తన సినిమాలతో బిజీగా ఉండటం... కార్తికేయ తన తండ్రి రాజమౌళి ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకోవడం వంటివి చేస్తుంటారు. కార్తికేయకు డైరెక్షన్ చేయాలని ఎప్పటినుండో ఓ కోరిక ఉంది. ఈ నేపథ్యంలో మీరు మీ ఫ్రెండ్ అఖిల్ ని హీరోగా పెట్టి సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రశ్నకు కార్తికేయ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పాడు. "అఖిల్ కెరీర్ నాశనం చేయదలచుకోవాలంటే నేను అతడి సినిమాకు డైరెక్షన్ చేయాలి’’ అంటూ నవ్వేసాడు.
కాబోయే భార్య గురించి...
" ఒకవేళ అతనితో సినిమా చేయాలంటే.. ప్రస్తుతం వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా లాంటి సినిమా చేయాలనీ అని అన్నాడు. అటువంటి స్టోరీ అయితే అఖిల్ కు కరెక్ట్ గా సెట్ అవుతుంది" అని చెప్పాడు. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోయే పూజా గురించి అడగగా.."తను, నేను ఆరేళ్ల నుండి ప్రేమించుకుంటున్నాం..పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాం" అని అన్నాడు. "ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకుంటాం. నేను కొంచం హైపర్ కానీ పూజ చాలా కామ్ అండ్ కూల్ అందుకే మా మధ్య బంధం బాగుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం.. డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటున్నాం. కూర్గ్ కానీ.. చిక్ మంగుళూరులో కానీ జరగొచ్చు అవన్నీ త్వరలోనే చెప్పుతాం" అని చెప్పాడు.