Mon Dec 23 2024 11:50:34 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే షాపింగ్ మాల్ పై నుండీ దూకేశాను : అఖిల్
"నేను షాపింగ్ మాల్ పై నుంచి దూకడం గురించి అంతా అడుగుతున్నారు. అంత రిస్క్ అవసరమా అంటున్నారు. నేను ఒక యంగ్ హీరోను.
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తీసిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ పై నుంచి దూకిన స్టంట్ గురించి వివరణ ఇచ్చారు. నిజానికి ఆ స్టంట్ తర్వాత చాలా మంది.. సినిమాలో కంటెంట్ ఉంటే ఇంత రిస్క్ అవసరమా ? అని నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.
"నేను షాపింగ్ మాల్ పై నుంచి దూకడం గురించి అంతా అడుగుతున్నారు. అంత రిస్క్ అవసరమా అంటున్నారు. నేను ఒక యంగ్ హీరోను. నేను కూడా నా కెరియర్ కోసం ఎంత కష్టమైనా పడతాను. నా ఫ్యాన్స్ ను ఆనందింపజేయడం కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాననే విషయం అందరికీ తెలియాలి. అందువల్లనే నేను ఆ ఫీట్ చేయడం జరిగింది" అని అఖిల్ పేర్కొన్నాడు.
"మిగతా హీరోలు చేసినవే చేయడానికి అఖిల్ ఎందుకు? అని మా నాన్న నాతో అంటూ ఉంటారు. నాకు కూడా అది నిజమే కదా అనిపించింది. అందుకే కొత్త జోనర్స్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అలా చేసిన సినిమానే 'ఏజెంట్'. కెరియర్ ఆరంభంలోనే నాపై అంచనాలు ఎక్కువగా ఉండేవి. వాటిని అందుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. ఏజెంట్ తో ఆ అంచనాలను అందుకుంటానని భావిస్తున్నాను" అఖిల్ తెలిపాడు.
Next Story