అఖిల్ సినిమా అందుకే స్టార్ట్ కాలేదు..!
లైన్స్ చెప్పి మన హీరోస్ ని ఇంప్రెస్స్ చేసే మన డైరెక్టర్స్ చాలామంది ప్రస్తుతం సెకండ్ హాఫ్ ను డీల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. స్క్రిప్టు [more]
లైన్స్ చెప్పి మన హీరోస్ ని ఇంప్రెస్స్ చేసే మన డైరెక్టర్స్ చాలామంది ప్రస్తుతం సెకండ్ హాఫ్ ను డీల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. స్క్రిప్టు [more]
లైన్స్ చెప్పి మన హీరోస్ ని ఇంప్రెస్స్ చేసే మన డైరెక్టర్స్ చాలామంది ప్రస్తుతం సెకండ్ హాఫ్ ను డీల్ చేసే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. స్క్రిప్టు వరకూ వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. సెకండ్ హాఫ్ దగ్గర ఏమీ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితే ఎదురుకుంటున్నాడు శ్రీకాంత్ అడ్డాల. గీతా ఆర్ట్స్ లో ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న శ్రీకాంత్ ఇంకా సెకండ్ హాఫ్ ని అల్లే పనిలో ఉన్నాడు. అలానే బొమ్మరిల్లు భాస్కర్ కూడా. అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లాలి కానీ ఇంకా స్టోరీ రెడీ అవ్వకపోవడంతో హోల్డ్ లో ఉంది.
బొమ్మరిల్లు భాస్కర్ దీ అదే పరిస్థితి
సెకండ్ హాఫ్ విషయంలో డైరెక్టర్ భాస్కర్ కు ఇంకా ఓ క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు రైటర్స్ ని కూర్చోబెట్టినా సెకండాఫ్ తేలడం లేదని టాక్. కరెక్ట్ గా ఇంటర్వెల్ దగ్గర నుండి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాడని టాక్. అయితే ఈ లోపే ‘ముందు చేతిలో ఉన్న సీన్లు తీసేద్దాం’ అని భాస్కర్ తొందరపెడుతున్నా… అల్లు అరవింద్ మాత్రం ‘కాంగారేం లేదు. స్క్రిప్టు పూర్తిగా సిద్ధమయ్యాకే మొదలెడతాం’ అంటున్నాడట. అందుకే భాస్కర్ సెకండ్ హాఫ్ పై కుస్తీలు పడుతున్నాడు. మరి ఇది ఎప్పటికి తేలుతుందో, సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.