అఖిల్ కు ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా?
వరుసగా రెండు డిజాస్టర్స్ తో ఉన్న అక్కినేని అఖిల్ తన మూడో సినిమా ఎవరితో ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసారు. అందరూ అనుకున్నట్టు గానే అఖిల్ ఓ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. 'తొలి ప్రేమ' సినిమాతో వరుణ్ తేజ్ లో ఇంకో యాంగిల్ ని చూపించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తన రెండో సినిమా అఖిల్ తో చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.
అఖిల్ కు జోడీగా సీఎం లవర్...
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. అఖిల్ కు జోడిగా సీఎం లవర్ అనుకున్నారు. అదేనండి మహేష్ బాబు 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానిని అనుకున్నారు.
ఛలో లండన్...
ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈ నెల 29వ తేదీ నుంచి లండన్ లో ఆరంభించనున్నారు. కథ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా లండన్ లోనే జరగనుంది. ఆల్రెడీ టీం లండన్ లోని కొన్ని లొకేషన్స్ ను లాక్ చేసింది. త్వరలోనే అఖిల్ అండ్ కైరా అద్వాని అక్కడికి వెళ్లనున్నారు. 'తొలిప్రేమ' సినిమా కొంత భాగం లండన్ లోనే షూట్ చేసారు. ఆ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మళ్లీ ఇప్పుడు అదే సెంటిమెంట్ తో వెంకీ ఈ సినిమా అక్కడే షూట్ చేయనున్నారు. మరి సెంటిమెంట్ పరంగా చూసుకుంటే అఖిల్ సినిమా తొలిప్రేమ లాగా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.