Mon Dec 23 2024 07:33:41 GMT+0000 (Coordinated Universal Time)
సన్నీ పై ఫైర్ అయిన అఖిల్.. సోహెల్ ను అవమానించాడంటున్న నెటిజన్లు
నాల్గవ సీజన్లో సోహెల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేసిండు. నన్ను కూడా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేత.. వీజే సన్నీ హీరోగా పరిచయం అవుతున్న సినిమా సకలగుణాభిరామ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ తో పాటు.. గత సీజన్ల కంటెస్టెంట్లు కొంతమంది హాజరయ్యారు. అయితే.. ఈ ఈవెంట్ లో వీజే సన్నీ.. సోహెల్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి.
Also Read : ఏపీలో శాంతిస్తోన్న కరోనా.. గడిచిన 24 గంటల్లో ?
స్టేజిపై సోహెల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "నాల్గవ సీజన్లో సోహెల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ వీడు డబ్బులు తీసుకుని వచ్చేసిండు. నన్ను కూడా అందరూ అంతే అన్నారు. నీకన్నా 10 లక్షలు ఎక్కువే పెట్టిర్రు. అయినా సరే టెంప్ట్ కాలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా" అని గర్వంగా చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోహెల్ ఫ్యాన్స్.. సన్నీ పై మండిపడుతున్నారు. సోహెల్ గురించి అలా మాట్లాడటం సరికాదని, అందరి ముందూ అవమానించాడని నెటిజన్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపైనే అఖిల్ సార్థక్ పరోక్షంగా స్పందించాడు. సన్నీ పేరు చెప్పకుండానే.. తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ విషయంపై పోస్ట్ చేశాడు. "ఎవరినైనా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు వారిని గౌరవించాలి గాని.. అవమానించకూడదు. మనం హీరో అవ్వాలని పక్కనోళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజి మీద చూడటం చాలా బాధ కలిగించింది. నేను అక్కడే ఉంటే బాగుండేది" అని పోస్ట్ చేశాడు. పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే అఖిల్ దానిని డిలీట్ కూడా చేశాడు.
Next Story