Mon Dec 23 2024 06:58:07 GMT+0000 (Coordinated Universal Time)
Pawan - Nani : పవన్ కొడుకుని మించిపోయిన నాని కుమారుడు..
పవన్ కళ్యాణ్ మరియు నాని తనయులు.. తండ్రి పై తమకి ఉన్న ప్రేమని మ్యూజిక్ టాలెంట్ తో తెలియజేస్తున్నారు.
Pawan Kalyan - Nani : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేచురల్ స్టార్ నాని తనయులు.. ప్రస్తుతం ఒకే దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. పవన్ కుమారుడు అకిరా నందన్.. యాక్టింగ్ పై కాకుండా మ్యూజిక్ పై దృష్టి పెడుతున్నాడు. పియానో పై మ్యూజిక్ ప్లే చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈమధ్య కాలంలో నాని కొడుకు అర్జున్ కూడా పియానో పై మ్యూజిక్ ప్లే చేస్తూ అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఇక ఈ మ్యూజిక్ టాలెంట్ తో వీరిద్దరూ.. తండ్రి పై తమకి ఉన్న ప్రేమని తెలియజేస్తున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్లో అకిరా.. యానిమల్ మూవీలోని 'నాన్న నువ్వు నా ప్రాణం' అనే పాటని పియానో మీద ప్లే చేసి వినిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ అయితే ఆ వీడియో చూసి బాగా ఎమోషనల్ అయ్యారు.
తాజాగా నాని కొడుకు అర్జున్ కూడా.. తండ్రి పై తన ప్రేమని మ్యూజిక్ ద్వారా తెలియజేసాడు. రీసెంట్ గా నాని పుట్టినరోజు వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులు, ఫ్యామిలీ పర్సన్స్.. నానికి తమకి తోచిన విధంగా విషెస్ తెలియజేసారు. ఈక్రమంలోనే అర్జున్.. "తన తండ్రికి మ్యూజిక్ అంటే ఇష్టమని, అందుకని పుట్టినరోజు కానుకగా మ్యూజిక్ ని బహుమతిగా వినిపిస్తున్నాను" అంటూ చెప్పి నాని కోసం మ్యూజిక్ ప్లే చేసాడు. ఆ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Next Story