Mon Dec 15 2025 06:42:44 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ జాయిన్ అయిన అకీరా.. క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో చేరాడు. ఈ విషయాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇటీవల నార్వేలోని స్టావెంజర్ లో బాహుబలి చిత్రం మ్యూజిక్ సింఫనీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, రాఘవేంద్రరావు, రేణూ దేశాయ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్ లతో కలిసి ఫొటోకు పోజు ఇచ్చారు. ఆయన స్పందిస్తూ... "నాలుగోతరం వారసులతో కలిసి నార్వేలో ఉన్నాను. నా మనవడు కార్తికేయ, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్... వీరిద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు" అని అన్నారు.
అకీరానందన్ సినిమా ఎంట్రీ విషయంలో తన తల్లి రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అకీరాకు ప్రస్తుతానికి నటన పట్ల అంత ఆసక్తి ఏమీ లేదు.. ఒకవేళ తనకి నటన పట్ల ఆసక్తి ఉండి ఉంటే సినిమాలు చేస్తానని నిర్ణయించుకుంటే.. మొట్ట మొదటగా నేనే మీ అందరితో ఆ విషయాన్ని పంచుకుంటాను ప్రస్తుతానికి ఈ కామెంట్స్ అన్నీ వద్దు అని పోస్టు పెట్టారు.
Next Story

