చైతు రిస్క్ చేశాడా..?
నాగ చైతన్యని వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఫ్లాప్స్ చైతూకి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా భార్య సమంత క్రేజ్ ని [more]
నాగ చైతన్యని వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఫ్లాప్స్ చైతూకి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా భార్య సమంత క్రేజ్ ని [more]
నాగ చైతన్యని వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. యుద్ధం శరణం, సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు ఫ్లాప్స్ చైతూకి నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా భార్య సమంత క్రేజ్ ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నాడు. నిన్నుకోరితో సాలిడ్ హిట్ అందుకున్న శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంతతో కలిసి మజిలీ సినిమా చేసాడు. ఈ సినిమాలో చైతు – సమంత భార్యాభర్తలుగా ఒరిజినల్ పాత్రలనే పోషించారు. మరో హీరోయిన్ దివ్యంశ ఈ సినిమాలో చైతు గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఇక శివ నిర్వాణకి హిట్ ఉండడం, సమంత క్రేజ్ తో ఈ మజిలీ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.
దర్శకులకు బ్యాడ్ సెంటిమెంట్
కానీ దర్శకులకు చాలాకాలం నుండి ద్వితీయ విఘ్నం వెంటాడుతుంది. ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని దాటలేక నానా అవస్థలు పడుతున్నారు. అందులో వెంకీ అట్లూరి, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు. వారు మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్నా సెకండ్ మూవీతో కనబడకుండా పోతున్నారు. చాలామంది దర్శకులు ఈ ద్వితీయ విఘ్నానికి బలవుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు దర్శకులు సక్సెస్ అయినా.. చాలామంది దర్శకులు ఫెయల్ అయ్యారు. మరి చైతు అసలే ఫ్లాప్స్ లో ఉన్నాడు. మరి ఏప్రిల్ 5న విడుదల కాబోయే మజిలీ సినిమా ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతం మాత్రం చైతు రిస్క్ చేసాడనిపిస్తుంది.