Sun Dec 22 2024 23:05:24 GMT+0000 (Coordinated Universal Time)
ఎమోషనల్ అయిన నాగార్జున.. వీడియో షేర్ చేసిన శర్వానంద్
సైన్స్ ఫిక్షన్ డ్రామాగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ కి అమ్మగా ..
శతమానంభవతి తర్వాత.. సరైన హిట్ లేక వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న శర్వానంద్.. తాజాగా "ఒకే ఒక జీవితం" సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రేపు ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ కి అమ్మగా అమల నటించింది. తాజాగా ఈ సినిమా ప్రివ్యూ షో వేశారు. ప్రివ్యూ చూసిన అనంతరం నాగార్జున మీడియాకు బైట్ ఇచ్చారు. అందులో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. "సినిమా చాలా ఎమోషనల్ గా అందంగా ఉంది. అమ్మపై ప్రేమ ఉన్న ఎవరికైనా ఈ సినిమా కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమా చూశాక నేను కూడా మా అమ్మని తలచుకుని ఏడ్చేశాను" అని ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ చెప్పారు నాగ్.
అమల మాట్లాడుతూ.. "ప్రివ్యూ షో చూసేందుకు మా అమ్మ కూడా రావటం నాకు చాలా విలువైనది. ఈ రోజు నేను ఇలా ఉండటానికి కారణం కేవలం మా అమ్మ మాత్రమే. ఆమెకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను" అని పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించగా.. శర్వానంద్ కు జోడీగా రీతువర్మ నించింది. నాజర్, రవి, రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమల గతంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పాగల్ సినిమాల్లో హీరోలకు తల్లిగా నటించారు.
Next Story