Thu Apr 03 2025 10:55:41 GMT+0000 (Coordinated Universal Time)
అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం
అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం నెలకొంది. నాగార్జున సోదరి

అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం నెలకొంది. నాగార్జున సోదరి నాగ సరోజ కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ముంబయిలో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆమె ఇటీవల హైదరాబాదులో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుక వేళ అక్కినేని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కినేని విగ్రహావిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు.
అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు నాగ సుశీల, నాగ సత్యవతి, నాగ సరోజ, వెంకట్, నాగార్జున సంతానం. వీరిలో నాగ సత్యవతి చాన్నాళ్ల కిందటే కన్నుమూశారు. నాగ సరోజ సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు. గత కొంతకాలంగా నాగ సరోజ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తుంది. నాగ సరోజ అంత్యక్రియల సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story