సమంత కోసం క్యూ కడుతున్నారు
పెళ్లికి ముందు అటు ఇటుగా ఫ్లాప్స్ వచ్చినా పెళ్లి తర్వాత కెరీర్ లో అవకాశాలు రావనుకుంటే దానికి పూర్తి విరుద్ధంగా సమంత కెరీర్ ఉంది. నాగ చైతన్యతో [more]
పెళ్లికి ముందు అటు ఇటుగా ఫ్లాప్స్ వచ్చినా పెళ్లి తర్వాత కెరీర్ లో అవకాశాలు రావనుకుంటే దానికి పూర్తి విరుద్ధంగా సమంత కెరీర్ ఉంది. నాగ చైతన్యతో [more]
పెళ్లికి ముందు అటు ఇటుగా ఫ్లాప్స్ వచ్చినా పెళ్లి తర్వాత కెరీర్ లో అవకాశాలు రావనుకుంటే దానికి పూర్తి విరుద్ధంగా సమంత కెరీర్ ఉంది. నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత సమంతతో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకనిర్మాతలు భయపడ్డారు. అక్కినేని ఇంటి కోడలుగా వెళుతున్న సమంతతో సినిమాలు చేసే ధైర్యం ఎవరూ చెయ్యలేదు. ఇక పెళ్లి తర్వాత సమంత కెరీర్ క్లోజ్ అన్న వారికి సమంత తాజా ఆఫర్స్ చూస్తుంటే దిమ్మతిరిగిపోద్ది. పెళ్లి తర్వాత సమంత గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సినిమాలకు దూరమైన మాట వాస్తవమే. కానీ నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ సమంత పెళ్లి తర్వాత కెరీర్ లో ఒక వెలుగు వెలుగుతుంది. మంచి సినిమాలను, తనకు నచ్చిన పాత్రలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ సమంత కెరీర్ ని మలుచుకుంటుంది.
రెండేళ్లు డైరీ ఫుల్
పెళ్లి తర్వాత నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నా హద్దులు దాటడం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలతో సర్దుకుపోతూ లిప్ కిస్ లకు, అందాల ఆరబోతకు ఒప్పుకోవడం లేదు. తాజాగా మజిలీలో సమంత పాత్ర చూస్తే ఆమె నటనలో పరిపూర్ణత తెలుస్తుంది. శ్రావణి పాత్రలో సమంత నటించలేదు. జీవించింది. బయట భార్యాభర్తలుగా చైతు – సామ్ లు ఎలా ఉంటారో తెలియదు కానీ మజిలీ సినిమాలో ఈ జంట మధ్య రొమాంటిక్ సీన్స్ లేకపోయినా.. అందులో ఉండే అందమైన సంఘర్షణ అర్ధమవుతుంది. అయితే మజిలీ తర్వాత ఓ బేబీ, 96 రీమేక్ చేస్తున్న సమంత కోసం ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. సమంతతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారట. మరి అక్కినేని కోడలికి అవకాశాలు రావేమో అనేవారికి ఇప్పుడు సమంత డైరీ చూస్తే అర్ధమవుతుంది. వచ్చే రెండేళ్లపాటు సమంత డైరీ ఫుల్.